నా మొదటి బ్లాగు
రండి రండి, నా మొట్టమొదటి బ్లాగు ఇది (బ్లాగర్ లో. కానీ పది రోజుల క్రితమే.. నా మొట్టమొదటి బ్లాగు యహూ 360 లో రాసాను.. ఈ క్రింద రాసిన విషయాన్నే). ఇంతకీ ఎలా ఉంది నా ఈ బ్లాగు? బాగుందా? ఇంకా ఏమీ చూడకుండానే బాగుందా అనేస్తే ఎలా.. అదీ మొదటి బ్లాగుకే ఎలా చెప్తాను, అసలు ఏమి రాతలు ఉంటాయొ, ఏమి content ఉంటుందో చూసి కదా చెప్పేది అంటారా? సరే చెప్తా వినండి. నేను పెద్దగా రాసేది ఏమీ ఉండకపోవచ్చు ఇక్కడ. ఆగండాగండీ.. అప్పుడే వెళ్ళిపోకండి. నేననేది ఏంటంటే నేను నా ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టానిష్టాలు అన్ని ఇక్కడ ఏమీ వ్రాసెయ్యకపోవచ్చు, ఎందుకంటే నాకు అంత ఓపికా ఖాళీ తీరికా ఎటూ లేవు, దానికి మించి అలోచన ప్రస్తుతానికి ఐతే లేదు. వ్రాసెయ్యక"పోవచ్చు" అని ఎందుకు అన్నానంటే, ఏమొ రేపెప్పుడైనా నాకు బుద్ది పుట్టి అలా వ్రాయటమ్మొదలు పెట్టనూవచ్చు.
కాని ఒక్కటి మాత్రం తప్పకుండా చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఫొటొగ్రఫీ అంటే ఇష్టం. కానీ ఇప్పటిదాక అలా ఇష్టం అనుకోవటం తప్పించి పెద్దగా ఏమీ చేయలేదు, కారణం తీరిక లేకపోవటం, Resources లేకపొవటం, ముఖ్యంగా Digital Camera లేకపోవటం. ఈమధ్యనే Canon S1 IS కొన్నాను. బాగుంది Camera. ముఖ్యంగా నాకు నచ్చినవి మూడు. 1. 10x జూం (10xzoom) 2. ఇమేజ్ స్టెబిలైజర్ (Image Stabilizer) 3. మేన్యుల్ కంట్రోల్స్ (Manual Controls) . ఇంక ఇప్పటి నుంచి కోతికి కొబ్బరికయ దొరికినంత కాకపోయినా, కనీసం తీరిక దొరికినప్పుడు, బుద్దిపుట్టినప్పుడు తీసిన ఫొటోలు అప్పుడప్పుడు ఇక్కడ పెడుతుంటాను. అసలు ఈ పని యాహూ 360 లోనే చేద్దామని అనుకున్నాను, నాలుగైదు ఫొటోస్ అక్కడ పెట్టాను కూడా.. కానీ అక్కడ పోస్ట్ అయ్యాక ఫొటో చాలా చిన్నది ఉంటుంది. అస్సలు నచ్చలేదు ఆ సైజు. అదిగో అందుకే ఇక్కడ మకాం పెడదామని నిర్ణయించుకున్నాననమాట.
ఇంకా.. ఇంకా ఏమి చేయొచ్చంటె .."నువ్వు నాకు నచ్చావు" సినిమాలో హీరో "IAS IPS లాంటివి కాకుండా ఏదో చిన్న ..." డైలాగ్ లాగా నేను చూసిన సినిమాలకి నా సమీక్షలు, విన్న పాటలకి నా సమీక్షలు, చదివిన ఆర్టికల్స్ లో నచ్చినవి, చదువుతున్నవి/చదవాల్సినవి/చదవాలనుకుంటున్నవి పుస్తకాల (నేను తెగ పుస్తకాలు చదివేస్తాను అని భ్రమపడొద్దు. నేను పుస్తకం పూర్తి గా చదివి సంవత్సరన్నర పైన అయిందేమో) మీద అభిప్రాయలు ఇలా ఇన్ని పెట్టేద్దామని ఒక క్షణం అనిపించినా దానికి చాలా సమయం కేటాయించాలి. కాబట్టి ఎప్పుడన్నా టూకీగా మాత్రం వాటి గురించి ఏమన్నా వ్రాయొచ్చేమో.
ప్రస్తుతానికి ఐతే మాత్రం ఇదీ నా ప్లాను. ముందు ముందు ఇంకా ఏమన్నా ఎక్కువ చేయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు.
1 Comments:
GOOD WORK :)
Post a Comment
<< Home