Updates.. My photography
I have decided, I am buying dSLR. It should be rebel XT or D50. ఇన్నాళ్ళూ ఆగింది చాలూ, ఏవో డబ్బులు చేతికొచ్చాయి/రాబోతున్నాయి కదా, ఇంక కొనేద్దామని 4-5 రోజులు క్రితం అనుకున్నప్పటినుండి ఎంత ఆలోచిస్తున్నా యీ రెండిటిలో ఏది కొనుక్కోవాలో నిర్ణయించుకోలేకపోతున్నా. రెండూ ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ఒకలాగే ఉన్నా చిన్న చిన్న తేడాలు. D50 కన్నా Rebel XT ఒక 100-120 డాలర్స్ ఎక్కువ. కానీ Rebe XT లో more MP, slightly sharper image. పోనీ ఇది ఎడ్వాంటేజియుస్ ఏమో అనుకుంటే, D50 లో slightly better flash system, more battery life/more pictures per one full charge, and the kit lens is better than that of Rebel XT. సరే ఇదే తీసుకుందాము అంటే D50 is slightly (about 80 gms) heavier than Rebel XT, which is like 540 gms. అంత బరువున్న కేమరాలతో ఒక అరగంటా-గంట ఫొటోలు తీస్తే చేతులు నొప్పులేమన్నా వస్తాయేమో. కానీ ఈ Rebel XT తేలికగా ఉండటమే కాదు, D50 (which has solid grip and feel) పట్టుకున్నాక చూస్తే ఒకరమైన ప్లాస్టికీ feel ఉంది, which i didn't like initially, ఏమో usage లో పెద్దగా తేడా తెలియదేమో. హ్మ్.. 2-3 రోజులుగా dpreview forums లో తిరుగుతున్నాను.. ఎవరన్నా ఈ కే్మరాలు వాడినవాళ్ళుంటే మీ అనుభవాలు, అభిప్రాయాలు చెప్పండీ..!! కొనటం అనేది మాత్రం 1-2-3 రోజుల్లో కొనేస్తున్నాను (hopefully!!)
ఇది ఒక విషయం. రెండో విషయం, మాకు వేసవికాలం వచ్చేస్తుందీ.. I love summer.. చిన్నప్పుట్నుంచీ ఎండాకాలం లో ఎంత ఎండలు, వేడీ, కరెంటు అవీ ఇవీ ఉన్నా నాకెప్పుడూ ఎండాకాలమంటేనే ఇష్టం.. spring/summer brings back gush of memories of all kinds, all those good times had in holidays, lot of lot of things I just can't write/summerize anywhere, along with fresh good things. ఇంక ఇక్కడికోచ్చాక అయితే ఆ ఇష్టం ఇంకా పెరిగిపోయింది. ఒక అయిదు నెలలు పాటూ చలి, ఎండిపోయిన చెట్లూ, వాడిపోయిన మొక్కలు తర్వాత సడెన్‌గా ఒకవారం రోజుల్లో మొత్తం చుట్టూ ఉన్న దృశ్యంతా మారిపోయి, ఎక్కడ చూసినా అన్ని రకాలు, అన్ని రంగుల పువ్వులు, ఎటు చూసినా ఆకుపచ్చగా మెరుస్తున్న లేత ఆకులు రోజుకి కనీసం నాలుగైదుసార్లన్నా "I llove summer" అనిపిస్తాయి. రెండు వారాల క్రితం వరకు సాయంత్రం అయిదున్నరా ఆరు గంటలకే చీకటి పడిపోయి, చీకటి ఫొటోలు తీసుకోవటం తప్ప వేరే దారి లేనట్టుండేది, spring మొదలవ్గానే ఏది చూసినా ఫొటో తీయాలనిస్తూనే ఉంటుంది. ఇంక spring అయిపోయి summer వచ్చేసినా, ఎండలు ఎంత ముదిరిపోయినా, I love summer జపిస్తూనే ఉంటాను, coz I really do. ఇంక చేతిలో కొబ్బరికాయ కూడా ఉంది కదా, కోతికి పండుగే పండుగ..!!
ఇప్పటివరకూ ఎటువంటి ఫొటోస్ తీసానో, ఉన్న కేమరాని ఎంత సద్వినియోగం చేసానో నాకైతే తెలియదు కానీ, I really hope, with spring coming in and with enhanced gear, I really put them to not only proper use, but to good use and learn some serious photograpy. తమ్ముడు సినిమాలో PK వాళ్ళ నాన్న అన్నట్టు కొత్తది ఉత్సాహాన్నిస్తుంది. And I hope I sustain that interest. అంత పెట్టి కొన్నదానికి న్యాయమన్నా చేకూర్చాలి కదా.
2 Comments:
plz change the bk grnd .......
antha baganey undhi kani....enthaki
kothi evaru....
aa kobbari chippa evaru...
ha ah aaa aah
( just joking)
Post a Comment
<< Home