Saturday, February 04, 2006

సూర్యాస్తమయం .. మరో ప్రయత్నం


డేటన్‌ వెళ్ళినప్పుడూ అస్తమిస్తున్న సూర్యుడిని తీయగలిగాను, చాల్స్టన్‌ వెళ్ళినప్పుడూ తీయగలిగాను కాని మా ఊర్లో నేను ఎప్పుడు ప్రత్యేకంగా ప్రయత్నించినా నేను వెళ్ళేటప్పటికి సూర్యుడు దిగిపోతున్నాడు. One of the reasons is that sun sets very early in winter and by the time I reach home from work, its almost too dark. ఈసారి ఇలా కాదని మొన్న శనివారం 4.45 కి బయల్దేరాను, 5.42 కి sunset అంటే. మామూలుగా 20 ని. ల లో వెళ్ళగలిగే లేక్ కి, మధ్యలో ఆగి బేటరీలు కొనుక్కుని ఆ ట్రాఫిక్ లో "టైం అయిపోతుంది, సూర్యుడు దిగిపోతున్నాడు, త్వరగ కదలండీఈఈఈ.." అని హైరానా పడుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోయింది. సరిగ్గా 5.47 కి కార్ దిగాను. సూర్యుడు కూడా దిగిపోయాడు. ఇంక ఏం చేస్తాను, ఆ వెలుగు లోనే కొన్ని ఫొటోస్ తీసి (కొన్ని సంతృప్తికరంగానే ఉన్నాయి) 9 గం.ల వరకు అక్కడే కూర్చుని వచ్చాను. And the other good thing I did is I took some sunrise pics the next day. In the next few days, I hope to upload some of the pics.

1 Comments:

Blogger చేతన_Chetana said...

థాంక్సండీ..!!

2:34 PM  

Post a Comment

<< Home