పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా..
పాడవోయి భారతీయుడా.. ఆడిపాదవోయి విజయగీతికా
నేడే స్వాతంత్ర్యదినం.. వీరుల త్యాగఫలం..నేడే నవోదయం నీదే ఆనందం..
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి..
సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే సరిపోదోయి.
ఆగకోయి భారతీయుడా కది్లి సాగవోయి ప్రగతిదారులా..
ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..
అవినీతి బంధుప్రీతి, స్త్రీ బతుకు బజారూ.. అలముకున్న ఈ దేశమెటు దిగజారూ..
కాంచవోయి నేటి దిస్థితి.. ఎదిరించవోయి ఈ పరీస్థితి..
పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ..
ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే..
స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం..
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం.. సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం..
4 Comments:
స్వతంత్ర దినొత్సవ శుభాకాంక్షలు.
ఇది శ్రీ శ్రీ కవిత కదండి?
chala bagundandi.... photo super... keka....
థాంక్స్ ఉదయ్, విజ్జు. అవును, ఏదో నాగేశ్వర్రవు సినిమాపాటకి శ్రీశ్రీ సాహిత్యం..
అందమయిన శుభాకాంక్షలు.ఆలస్యం గా అందుకున్నాను.
Post a Comment
<< Home