Friday, January 27, 2006

RebelXT తో ఇంకో ఫొటో


నాకు సాయంత్రాలే ఖాళీ దొరుకుతుండతం వలనైతేనేమి, నాకు నైట్ లేక లో లైట్ ఫొటోగ్రఫీ అంటే ఒకరకమైన ఇష్టమైతేనేమి, నేను తీసిన తక్కువ ఫొటోలలో, ఎక్కువ అవే ఉంటాయి. అసలు నాకు కొంతమంది ఫొటోలు,ఉదాహరణ కి, www.notraces.com లో బాబ్ పెట్టే నైట్ ఫొటోలు చూస్తుంటే, నేనేమి ఫొటోలు పెడ్తున్నాను, ఎందుకు పెడ్తున్నాను, నిజంగానే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుంది, ఈ బ్లాగు, ఆ కేమరా అనిపిస్తుంటుంది. అయినా అలాంటి ఫొటోలు తీయాలంటే తప్పనిసరిగా SLR camera ఉండాల్సిందే. ఆ ఫొటోలకి exposure 250 - 900 secs ఉంటుంది. P&S కేమరాలు, దాంట్లో ఉండే15 secs exposures సరిపోవు. నాకు ఆ ఫొటోలు చూస్తుంటే అరే అలాంటి ఫొటోలు తీయలేను అనే feelingతో కాళ్ళూ చేతులు కట్టేసినట్టుంటుంది. ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు ఉన్న కే్మరా తో సరిగ్గా తీయకుండా ఆ కేమరా కావాలి ఈ కేమరా కావాలి అంటే ఎలా మరి?

4 Comments:

Blogger ప్రదీపు said...

ఆ కెమెరా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి బాబు. అంతంత రేట్లు పెట్టి కొంటే ఇంకేమయినా ఉందా! కాకపోతే వాటితో వచ్చే ఫొటోలు మన కెమెరాలతో తీయటం కష్టం అని ఒప్పుకోవలసిందే.

ఒక అత్భుతమైన సైటుని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

4:56 AM  
Blogger చేతన_Chetana said...

అవునండీ. SLR అంటే $650-800 (ఎంట్రీ లెవెల్ ex. nikin d50, canon rebel xt)నుంచి $3000 - $5000 దాకా ఉంటాయి. అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయేమో. మళ్ళీ వాటికి లెంసులు, ఫిల్టర్స్, రిమోట్లు అవీ ఇవీ. ప్రస్తుతానికి ఆ rebel xt or d50 కొనుక్కోవచ్చేమో ఎప్పుడైనా అనుకోవటమే.

3:07 PM  
Blogger Sudhakar said...

Rebel XT 350D with a 1GB sdcard is now avaiable for 38k in hyderabad, so thats my next camera

1:52 PM  
Blogger చేతన_Chetana said...

Rebel XT or 350 D takes CF (compact flash) cards and not SD cards, in case you are wondering!

10:30 PM  

Post a Comment

<< Home