Friday, December 22, 2006

బొమ్మలకొలువు..

ప్రతీ సంవత్సరం సంక్రాంతికి బొమ్మలకొలువు పెట్టుకోవటం అలవాటు. సంక్రాంతి అంటే నిజంగా పెద్ద పండగే ఇంట్లొ. ఎంత హడావిడో. వారం రోజులముందు నుంచి ప్లాన్లు, ఎన్ని మెట్లు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టాలి.. ఏ బల్లలు, ఏ పెట్టెలు, ఏ పీటలు,ఏ చెక్కలు వాడాలి మెట్లకి. అని..ఆ నాలుగు రోజులు ఏ ముగ్గులు పెట్టాలి అని. రెండ్రోజుల ముందు కావిడి పెట్టెలు దించటం, ఏళ్ళనుంచి వస్తున్న బొమ్మలతోపాటు, కొత్తగా వచ్చి చేరుతున్న బొమ్మలన్నీ జాగ్రత్తగా చుట్టిపెట్టిన పెట్టెల్లోంచి తీయటం.. ఏవి పెట్టుకోతగ్గవిగా బాగున్నాయి, వేటిని ఇంక పక్కన పెట్టెయొచ్చు అని చూసుకోవటం, అన్ని శుభ్రాలు చేసుకోవటం.. ఒక్కో పాత బొమ్మ వెనకల అమ్మ చిన్నప్పటి కబుర్లు, అమ్మమ్మ ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చింది, అమ్మ ఎప్పుడు ఏ బొమ్మ చేసింది అనీ.. ఒక పక్కన తమ్ముడు సాయం చేయటం లేదని విసుక్కోవటాలు, చందనం బొమ్మలు (బొమ్మలన్నిటికి లీడర్‌ టైపు.. వాటికి అగ్రతాంబూలం ఇవ్వాలి, 4 పూటలు ఆరగింపులు పెట్టాలి) శుభ్రం చేసి, నలుగు స్నానాలు చేయించి, అమ్మ కుట్టిన బట్టలు కట్టి, నగలు పెట్టీ అలంకరించటం. మెట్లు సర్ది, అన్ని బొమ్మలు ఒక్కోటీ చూసుకుంటూ ఏవి ఎక్కడ పెడితే బాగుంటందనిపిస్తుందో తెగ discussions, ఈలోపు ప్రతీసారీ సంక్రాంతికి వచ్చే అక్క (cousin) పెట్టే గోరింటాకు, అక్క పిల్లల హడావిడి, పేరంటానికి పిలుపులు, పనమ్మాయిని కళ్ళాపుకి పేడ తెమ్మని వెనకాల పడటం. రాత్రయ్యేసరికి ముగ్గుల రంగుల హడావిడి. భోగిరోజు పొద్దున్న (ముందురోజు రాత్రిపెట్టుకున్న)ముగ్గుకి రంగులు అద్దుతుంటే పక్కన తమ్ముడి భోగిమంట. ఇంక బొమ్మలు అన్నీ సర్దేక వాటి ఆరగింపులు, మన ఆరగింపులు, సంక్రాంతి రోజు సాయింత్రం పేరంటం హడావిడి.. చిన్నప్పుడు భోగిరోజు గొబ్బిళ్ళ హడావిడి ఉండేది. ఎప్పుడు ఆగిపోయిందో గుర్తు కూడా లేదు.

ఇక్కడికొచ్చిన అయిదేళ్ళూ ఇంట్లో అసలు సంక్రాంతికి హడావిడే లేదు. ఇక్కడయితే పండగ ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్ళిందో తెలియనంతగా ఉంటుంది. ఈసారి మే నెలలో ఇంటికి వెళ్ళినప్పుడు, ఏ పండగ లేకపోయినా పెట్టుకోవాల్సిందే అని పెట్టుకున్నాం. కానీ trips హడావిడి అలసటలో, ఓపికా, interest లేక ఏదో తూతూమంత్రం లా.. చిన్నగా తక్కువ బొమ్మలతో అయింది. తీరా అంతా పెట్టుకుని పేరంటానికి అందరూ వచ్చిన టైంకి.. పెద్ద గాలివాన..దానితో కరెంటు కూడా పోయింది. :-)..


Labels: ,

చిన్న తిరుపతి - 5

Labels: ,

చిన్న తిరుపతి - 4

Labels: ,

చిన్న తిరుపతి - 3

Labels: ,

చిన్న తిరుపతి - 2


చిన్న తిరుపతి ఫొటోలు చూస్తుంటే గుర్తొచ్చింది.. ఆ క్రితం రోజు చాలా మంచి ముహుర్తం ఉందనుకుంట.. ఆరోజు గుడిలో ఎంతమంది జంటలో పెళ్ళిబట్టలతో, తలమీద బట్టల మీద తలంబ్రాల పసుపు, నలిగిపోయిన పెళ్ళిదండలు, తలలో వాడిపోయిన పూలు.. కాని మొహాలు మాత్రం వికసించి.. ఒకపక్క అలసిపోయి ఉన్నా. కనీసం 70-80 జంటలు చూసుంటాం.. మా తమ్ముడు నేను సర్దాగా చాలా ఫొటోలు తీసాం. :-)

Labels: ,

చిన్న తిరుపతి / ద్వారకా తిరుమల

Labels: ,

శ్రీశైలం -2


శ్రీశైలంలో కృష్ణానది..

Labels: ,

శ్రీశైలం



ఈరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చేసాను. చేసే పనేమి లేదు. ఎప్పుడో దేశం వెళ్ళివచ్చిన దగ్గెరనుంచి పోస్ట్ చేద్దమనుకుంటున్న ఫొటోలు చూస్తూ, ఒకోటి upload చేస్తున్నా. ఆ ఫొటోల పరంపరలో ఇది మొదటిది. శ్రీశైలం. May not be best pictures.. but just pictures from places I've been to this time.
(Dam in Sri Sailam, First of the series of photos I wanted to post since I got back from my last trip to home)

Labels: ,

Tuesday, September 19, 2006

అన్నవరం-2 పంపా నది..


తెలుగు వికిపీడియాలో అన్నవరం మీద వ్యాసంలో "సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది" అని చూసి ఈ ఫొటో పోస్ట్ చేయాలనిపించింది. సుమారు అయిదారేళ్ళ క్రితం వరకు ఆ మాట నిజమేమో. కొండమీదకి ఘాట్‌రోడ్‌ మీదుగా వెళ్తున్నప్పుడు కనిపించే ఆ జలాశయం నిండా కొండల మధ్య నుండి వస్తున్న నీరుతో కనులకింపుగా ఉండేది దృశ్యం.. మరి ఇప్పుడు? అది ఒక జలాశయం లేక నది అని తెలియని వారికి చెప్పినా నమ్మరేమో..

Labels: , ,

Wednesday, September 06, 2006

శ్రీశైలం..

Labels: ,

Saturday, September 02, 2006

ద్వారకా తిరుమల/చిన్న తిరుపతి కి స్వాగతం..

విగ్రహం నడుం దగ్గెర ముక్కు గోక్కుంటున్న పక్షి బట్టి విగ్రహం ఎత్తుని అంచనా వేయండీ..!!

Labels: ,

వేపచివురు..

Labels: ,

Sunday, August 27, 2006

వినాయకచవితి శుభాకాంక్షలు..!!


గమనిక: :-) ఈ ఫొటో తీసినవారు, నాకు పంపించినవారు హైదరాబాదు నుంచి మా తమ్ముడువారు. (ఏరా, చాలా??)

Labels: ,

Wednesday, August 09, 2006

సంధ్యవేళ గోదావరి..

Labels: , ,

అన్నవరం..

Labels: ,